How to know PF Balance with missed call,mobile

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలందరికీ పీఎఫ్ కట్ అవుతుంది కదా! ఎప్పుడైనా అందులో ఎంతుందో తెలుసుకోవాలనుందా? అయితే ఒక్క మిస్‌కాల్‌తో మీ ప్రొవిడెంట్ ఫండ్‌లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవచ్చు. అది కూడా ఓ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా. 01122901406 అనే నెంబర్‌కి మిస్ కాల్ ఇచ్చి చూడండి. కాసేపట్లో మీ సెల్‌ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. అయితే ఆ నెంబర్ మీ పీఎఫ్ అకౌంట్‌కు అనుసంధానమైన నంబర్ అయి ఉండాలి.

ఒకవేళ మీరు మీ నెంబర్‌ని అనుసంధానించకపోతే మాత్రం ఆ డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలియవు. కాబట్టి ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్లో లాగిన్ అయి మీ నెంబర్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ వివరాలు, మీ నెంబర్‌ని లాగిన్ చేసిన తర్వాత 48 గంటలకు మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఈ నెంబర్ ద్వారా మిస్‌కాల్ ఇవ్వొచ్చు. అసలు పీఎఫ్ అనేది ఉద్యోగ అనంతరం.. ఉద్యోగి భద్రత కొరకు ఉద్దేశించినది. రిటైర్మెంట్ తర్వాత ఇతరుల మీద ఆధారపడకుండా.. ఉద్యోగం చేస్తున్న సమయంలో భవిష్యత్ గురించి ముందుగానే ఓ ప్లాన్ చేసుకోవడం అన్నమాట.
Previous Post Next Post

Contact Form