మనమీద తప్పుడు కేసులు పెడితే ఎం చేయాలి?
అసలు మనం సమాజంలో ఇటువంటి పరిస్థితులను చాలాసార్లు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు ఎటువంటి తప్పు చేయకపోయినా మనమీద నేరారోపణ చేయడం జరుగుతున్నది. దానివల్ల చాలా సార్లు ఇబ్బంది పడ్డ వారు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి ఎటువంటి నేరం చేసి ఉండకపోవచ్చు. అతనిమీద నేరం మోపపడటానికి ఎటువంటి కారణం ఉండక పోవచ్చు కానీ కొంతమంది మనల్ని చూసి ఓర్వ లేక మన ఎదుగుదలను తట్టుకోలేక మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మనకు హాని చేయాలనే ఉద్దేశంతో మనం తప్పు చేయకపోయినా తప్పు చేశాడని ఉద్దేశపూర్వకంగా మన మీద కేసులు పెట్టడం మనపై పోలిసు వారిచే FIR నమోదు చేయడం చాలా మందికి తెలుసు.
మనపై తప్పుడు కేసులలో (False Case) ఇరికించి పోలిసు స్టేషన్లో FIR నమోదు అయి ఉంటే, బాధితుడు వెంటేనే భారత రాజ్యాగంలోని ఆర్టికల్ 226 క్రింద హైకోర్టు నందు "రిట్" పిటిషన్ దాఖలు చేయాలి. గౌరవ హై కోర్టువారు విచారణలో తప్పుడు కేసు అని రుజువైతే పోలీస్ స్టేషన్లో మనపై నమోదు చేసిన FIR ను కొట్టి (Quash) వేస్తుంది.
ఇలా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి ఎటువంటి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు తప్పుడు కేసులు పెడితే అలా పెట్టిన వారు "ఇండియన్ పీనల్ కోడ్" IPC సెక్షన్ 211 ప్రకారం శిక్షార్హులు అవుతారు.
ఉదాహరణకు:కొట్టకుండానే కొట్టాడని,గాయ పరచక ముందే గాయం చేసాడని, బెదిరించక ముందే బెదిరించడాని దూషించక ముందే దూషించడని అని ఎలాంటి నేరం చేయకుండానే మనం చేసామని మన మీద తప్పుడు కేస్ వేస్తే 2సంవత్సరాలు లేదా ఫైన్ లేదా రెండు పడే అవకాశం ఉంది.
తీవ్రమైన నేర ఆరోపణ మర్డర్, రేప్,అట్టెంప్టు మర్డర్, తీవ్రమైన గాయం చేయడం లాంటి "అబద్దపు ఆరోపణలు" మీ మీద చేస్తే ఇలాంటి తీవ్రమైన అబద్దపు నేర ఆరోపణ చేసే వాళ్లకు 7 సంవత్సరాల శిక్షపడే అవకాశం ఉంది.