పల్లవి:- శిల్పకారుడా - నా యేసయ్యా
శిలనైన నన్ను - నివలె మార్చావు
నీ రూపము నాకిచ్చి - నీ పొలికగాచేసి
నన్ను నీవలె - నిర్మించినావు
1. నేల మంటి తీసుకుని - మట్టి ముద్దగా చేసి
పరమ కుమ్మరి - నీ రూపుగ మలిచావు
నాశికా రంద్రములలో- జీవాత్మను ఊధగా
ప్రాణాత్మ దేహముతో - నను నిర్మించావు
// శిల్పకారుడా //
2.నా పాపము కొరకై - ఆ కల్వరి సిలువలో
పరమ తండ్రి - నీ రూపము కోల్పోతివా
నిష్కలంకమైన - రక్తము చిందించగా
ప్రాణాత్మ దేహముతో - నను విడిపించావు
// శిల్పకారుడా//
Lyrics by:- Samson mukkani
Tags
Samson Mukkani