Income tax ఫైల్ చేయాలన్నా, కొత్త బ్యాంకు ఎకౌంటు తెరవాలన్నా, gas సబ్సిడీ పొందాలన్నా.. ఇలా ప్రతి పనికి Aadhaar Card తప్పనిసరవుతోంది.
అయితే తప్పుడు వివరాలు అందించి, ఇతర ప్రమాణాలు పాటించకుండా కేటాయించబడిన మొత్తం 81 లక్షల Aadhaar Card నంబర్లను శాశ్వతంగా తొలగించినట్లు ఇటీవల కేంద్రప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 115 కోట్ల మందికి ఆధార్ కార్డు కేటాయించబడింది.
ప్రతి చిన్న పనికి Aadhaar నంబర్ తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో అసలు మన ఆధార్ కార్డు నెంబర్ ఉనికిలో ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరముంది.
ఆధార్ కార్డు పనిచేస్తుందో లేదో దేశ పౌరులు తనిఖీ చేసుకోవడానికి UIDAI సంస్థ ఓ వెరిఫికేషన్ టూల్ ని అందిస్తోంది. దీనికి మీరు చేయవలసిందల్లా verify Aadhaar number పేరుతో ఉండే ఒక వెబ్సైట్ సందర్శించి మీ ఆధార్ నంబర్ నీ, captcha codeనీ టైప్ చేస్తే సరిపోతుంది.
వెంటనే మీ ఆధార్ కార్డు యాక్టివ్ గా ఉందో లేదో స్క్రీన్ మీద తెలియజేయబడుతుంది.
81 Lakhs of Aadhar Numbers are removed,Check your Aadhar number status