Entrence Test for 5th Class Admission into TSWREIS, TTWREIS, MJPTBCWREIS,TREIS
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2024-25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన.
![]() |
| TGCET 2024-25 |
తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదురుకోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC, ST, BC మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖలద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై తేదీ 11.02.2024 నాడు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో) ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలకు, ప్రాస్పెక్టస్ కొరకు.
http://tswreis.ac.inమన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి సోపానాలు
సం/- Dr. ఇ. నవీన్ నికోలస్, ఐ.ఏ.యస్.
Secretary TSWREIS & Chief Convenor, VTG CET-2024 DIPR RO.No.8675-PP/CL/ADVT/1/2023-24, Dt: 15.12.2023