పల్స్ పోలియో 2021 | National Polio Drive 2021

 పల్స్ పోలియో 2021 | Polio Drops 2021

National polio drive : జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే క్రతువు జనవరి 31న నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ముందు ప్రకటించిన తేదీ ప్రకారం జనవరి 17 న దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్ జరగాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల రిత్యా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ పల్స్‌ పోలియో నిర్వహించే తేదీని వెల్లడిస్తామని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనల్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్‌ సలహాదారు ప్రదీప్‌ హల్డర్‌ రాష్ట్రాలకు సమాచారం అందించారు. కేంద్రం కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఈనెల 16 నుంచి చేపడుతుండటంతో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసి, ఇప్పుడు జనవరి 31న నిర్వహించబోతున్నారు.




Post a Comment

Previous Post Next Post

Contact Form