ఏ ఆట నీకిష్టమే చెల్లెలా - E Aata Nee Kistame Chellela
ఏ ఆట నీకిష్టమే చెల్లెలా ?
ఏ ఆట నీకిష్టము తమ్ముడా?
గురిపెట్టి కొట్టేటి
గోటీల ఆటనా ?
గవ్వలతో ఆడేటి
పచ్చిసు ఆటనా ?
పెంకాసు ఎసెటి
తొక్కుడు బిళ్లనా?
||ఏ ఆట||
గుండ్రంగా తిరిగెటి
బొంగరం ఆటనా?
కట్టెతో కొట్టేటి
చిర్రగొనె ఆటనా?
చేతులతో చప్పట్లు
చెమ్మ చెక్క ఆటనా?
||ఏ ఆట||
ఆటలన్ని ఇష్టమే ఓ అక్క
ఆటలన్ని ఆడుదాం ఓ తమ్మి !
Tags
1st Class