రైతు దివ్యమూర్తి - Rythu Divya murthi
వర్షకాలమందు వరదలు వచ్చిన
హాలముపట్టి రైతు పొలము దున్ని
చంటిపిల్లవాన్ని చనువుతో నడుముకు
యెద్దులను బెదిరియ యెత్తుకోని !
విత్తునాటే నుండి పైరు కోత వరకు
మగువకష్టపడును మస్తుగాను
పగలురాత్రియనక పంటలు పండించి
పడతి పాటు పడును పంట కొరకు !
అంబటేల నుండి అర్దరాతిరిదాక
మట్టిముఖము నెరుగు మగువనీవు
ధాన్య రాశినిచ్చే ధాన్యలక్ష్మీవమ్మా
రైతుగొప్పదనము నీదే రాణీ !
పొలము దున్ని నీవు పొట్టనింపును తల్లీ
పుడమిజనులకంత బువ్వ పెట్టు
పెరుమోసే రైతు పెనిమిటి అర్దాంగీ
ధాత్రియందు రైతు దివ్యమూర్తి !
రచయిత...
బోయ వెంకటేశం(అభినవ వాల్మీకి)
గోటిగార్ పల్లి, సంగారెడ్డి జిల్లా
Tags
Venkatesham Poetry