How to Change PF(Provided Fund) Registered Mobile Number in Online?

మీ ప్రావిడెంట్ ఫండ్ రిజిష్టర్ మొబైల్ నంబర్ ఆన్లైన్లో అప్డేట్ చెయ్యాలా. How to Change PF(Provided Fund) Registered Mobile Number in Online?

మన యొక్క EPF రిజిష్టర్ మొబైల్ నంబర్ ను ఆన్లైన్లో చాలా సింపుల్ గా మీరే మీ అప్డేట్ చేసుకోవచ్చు. మీ EPF అకౌంట్ కి సంబంధించి మీకు అన్ని అవసరాలకు ముఖ్యంగా అవసరమైనది UAN నంబర్. UAN నంబర్ అంటే, యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఇందులో, మీరు ఒకే UAN నంబర్ లో మీ అన్ని కంపెనీల EPF వివరాలు ఉంటాయి. సాధారణంగా మనం కొత్త మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు లేదా పాత నంబర్ ను మార్చవలసి వచ్చినప్పుడు EPF అకౌంట్ లో ఎలా అప్డేట్ చెయ్యాలో చాలా మందికి తెలియక పోవచ్చు. అందుకే, UAN లో మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ లేదా చేంజ్ ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకోండి.

UAN లో మొబైల్ నంబర్ ఎలా మార్చాలి?

  • ముందుగా UAN మెంబర్ e-సేవ పోర్టల్ ఓపెన్ చెయ్యాలి.
  • ఇక్కడ మీ UAN నంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తరువాత ఇక్కడ మీకు మెయిన్ పేజ్ కనిపిస్తుంది.
  • మెయిన్ పేజీలో Manage అనే అప్షన్ కనిపిస్తుంది, దీని పైన నొక్కండి.
  • ఇక్కడ మీరు Contact Details పైన నొక్కండి 
  • ఇక్కడ మీకు మీ రిజిష్టర్ మొబైల్ నంబర్ క్రింద Change Mobile Number అప్షన్ కనిపిస్తుంది
  • ఇక్కడ Change Mobile Number పక్కన బాక్స్ పైన టిక్ చేయండి 
  • వెంటనే మీకు కొత్త నంబర్ అప్డేట్ లేదా చేంజ్ చేయాల్సిన నంబర్ ఎంటర్ చేసి ఆధరైజ్ చేయండి

Post a Comment

Previous Post Next Post

Contact Form