జియో ప్రైమ్ మెంబర్లు జియో యాప్‌లోకి వెళ్లి అందులో తమ జియో నంబర్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం హోమ్ పేజీలో పై భాగంలో కనిపించే ''కంగ్రాచులేషన్స్ ఎక్స్‌టెండ్ జియో ప్రైమ్ ఫర్ ఎ ఇయర్, ఫ్రీ'' అనే మెసేజ్‌లో గెట్ నౌ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తరువాత వచ్చే స్క్రీన్‌లో రిక్వెస్ట్‌ను ఓకే చేసి కింద ఉండే ప్రొసీడ్ బటన్‌ను క్లిక్ చేయాలి. దీంతో రిక్వెస్ట్ రిజిస్టర్ అవుతుంది. ప్రైమ్ మెంబర్లకు ఎలాంటి రుసుం చెల్లించకుండానే మరో ఏడాది పాటు ఉచితంగా జియో ప్రైమ్ మెంబర్‌షిప్ లభిస్తుంది. దీంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎప్పటిలాగే జియో ప్రైమ్ సేవలను పొందవచ్చు. ఇప్పటి వరకు దాంతో లభించిన బెనిఫిట్స్ యథావిధిగా ఉంటాయి. వాటిని ఎప్పటిలాగే వాడుకోవచ్చు. ఇక జియోలో కొత్తగా చేరే కస్టమర్ అయితే రూ.99 చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందాల్సి ఉంటుంది.
Download My Jio App
Tags
Technology