పాలిసెట్ - 2018 పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ్రప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి వివిధ ఇంజినీరింగ్ కోర్స్‌ల్లో డిప్లొమా ప్రవేశానికి ప్రతి ఏటా నిర్వహించే పాలిసెట్ - 2018 నోటిఫికేషన్‌ను ఎస్‌బీటీఈటీ విడుదల చేసింది. పదోతరగతి తర్వాత టెక్నికల్ కోర్సులే మొదటి మెట్టు. మూడు/నాలుగేండ్ల డిప్లొమా పూర్తిచేసి జీవితంలో స్థిరపడే అవకాశం. ఉన్నత చదువులకు అవకాశం. టెక్నికల్ అంశాలపై పట్టుతో జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించే సువర్ణావకాశం.
diploma-students

వివరాలు:

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ (ఎస్‌బీటీఈటీ) పాలిసెట్‌ను నిర్వహిస్తుంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారానే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో రెండో షిఫ్ట్ డిప్లొమా పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 
పాలిసెట్ వివరాలు:
-ఆఫర్ చేస్తున్న కోర్సులు: 
-మూడేండ్ల కోర్సులు: సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ /ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోం సైన్స్. 
మూడున్నరేండ్ల కోర్సులు: 
-మెటలర్జికల్, కెమికల్ (సాండ్‌విచ్) ఇంజినీరింగ్.
-మూడున్నరేండ్ల కోర్సులు (ఏడాది ఇండస్ట్రియల్ ట్రెయినింగ్): కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, లెదర్ టెక్నాలజీ,ఫుట్‌వేర్ టెక్నాలజీ,టెక్స్‌టైల్ టెక్నాలజీ. 
-మూడేండ్ల కోర్సులు (ఆరు నెలల ఇండస్ట్రియల్ ట్రెయినింగ్): ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ (షుగర్ టెక్నాలజీ).
-మూడున్నరేండ్ల కోర్సులు (ఏడాది ఇండస్ట్రియల్ ట్రెయినింగ్): కెమికల్ ఇంజినీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ), కెమికల్ ఇంజినీరింగ్ (పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్ అండ్ పాలీమర్స్), సిరామిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ 
-అర్హతలు: బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టీఎస్/ఏపీచే గుర్తించిన ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలల్లో పదోతరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. పదోతరగతి కంపార్ట్‌మెంట్‌లో పాసైనవారు, పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రవేశం తీసుకొనే సమయానికి అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

గమనిక: సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ, ఓపెన్ స్కూల్ (టీవోఎస్‌ఎస్/ఏపీఎస్‌ఎస్), ఎన్‌ఐఓఎస్ తదితర బోర్డుల నుంచి పదోతరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టును చదివి ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీ అభ్యర్థులు రూ. 350/-, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 200/-
-ఎంపిక: పాలిసెట్ పరీక్ష ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 4 (సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే)
-పరీక్షతేదీ: ఏప్రిల్ 21 (శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు)
-ఫలితాలు విడుదల : ఏప్రిల్ 28
-వెబ్‌సైట్: https://polycetts.nic.in


పరీక్ష విధానం

-ఈ పరీక్షను 2 గంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు.
-పదోతరగతిస్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-మ్యాథ్స్- 60, ఫిజిక్స్- 30, కెమిస్ట్రీ- 30 మార్కుల చొప్పున మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులు.
-మొత్తం 120 మార్కులకు 36 మార్కులు క్వాలిఫయింగ్‌గా నిర్ణయించారు. 
-ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు క్వాలిఫయింగ్ మార్కులతో సంబంధం లేకుండా ఆయా కేటగిరీల్లో సీట్లు భర్తీ చేస్తారు.

TELANGANA POLYTECHNIC COMMON
 ENTRANCE TEST: 2018

 The State Boardof Technical Education and
 Training, Telangana, Hyderabad will condudt
 "Polytechnic Common Entrance Test
 (POLYCET)" for the candidates seeking
 admission in to all Diploma Courses in
 Engineering /Non Engineering/Technology
 offered at Polytechnics /Institutions (including
 Aided and Unaided Private Polytechnics
 /Institutions running as 2nd shift in Private
 Engineering Colleges) in Telangana State for the
 academic year 2018-19.
I
MPORTANT INSTRUCTIONS TO NOTE DOWNLOADS


  1. Commencement of olie fling of POLYCET-2018
  2. applications from Dt: 14/03/2018 (Download PDF)
  3. Last date of filing of online Application Form: Instructions to Users for 11/04/2018 at 05.00 pm
  4. Date of conduct of POLYCET-2018: 21/04/2018 (Saturday) Time: 11.00 AM to 01.00 PM


Online Application : Click Here
Online Fee Payment : Click Here

Previous Post Next Post

Contact Form