How to Apply for Ration Card in Telangana@tg.meeseva.gov.in

చౌకధరలకు ధరలకు లభించే నిత్యావసర సరకులకు కావల్సిన ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు)ల కోసం దారిద్య్రరేఖకు దిగువనున్న అనేక కుటుంబాల నిరీక్షణకు ఇక తెరపడనుంది. అర్హత కలిగిన కుటుంబాలకు ఆహార భద్రత కార్డులను అందించాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 1 నుంచి మీ సేవ కేంద్రాల్లో నిర్దేశిత ధృవపత్రాలు, ఇతరత్రా వివరాలతో కూడిన దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక, ఇతరాత్ర కారణాలతో కొంత కాలంగా ఆహార భద్రత కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

వివిధ కారణాల వల్ల గతంలో ఆహార భద్రత కార్డులు పొందని కుటుంబాలు, అదే విధంగా కొత్తగా పెళ్లయిన దంపతులు ఆహార భద్రత కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు అనేక మంది ఉన్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల్లో ఎక్కువ శాతం రేషన్ కార్డుల కోసమే కావడం గమనార్హం. అదే విధంగా తహసీల్ కార్యాలయాల్లోనూ వీటి కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతున్నది. ఇది వరకు ఆహార భద్రత కార్డులు పొందని దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు కొత్త కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయంచడంతో పలు కుటుంబాలకు ప్రయోజనం కలగబోతుంది. కొత్తవాటి కోసం దరఖాస్తులు చేసుకోవడంతో పాటు గతంలో జారీ అయిన కార్డుల్లో తప్పుల సవరణ, పెరిగిన కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు సైతం అవకాశం కల్పించడం జరిగింది. కొత్తగా ఆహార భద్రత కార్డుల జారీకి తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అనేక కుటుంబాలకు ఊరట కలిగించినైట్లెంది.

ఇవీ జతపరచాలి..
* ప్రస్తుత నివాసం(సరైన), చిరునామా వివరాలు
* దరఖాస్తుదారు (కుటుంబ యజమాని) గుర్తింపు కార్డు ఓటరు / డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డు నకలు
* కుటుంబ యజమాని పాస్‌పోర్టు సైజ్ పోటో తప్పని సరి
* కుటుంబ యజమాని వయస్సు ధ్రువీకరణపత్రం లేదా పాఠశాలలో చదివినప్పటి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జతపర్చాలి.
* కుటుంబ యజమాని సంవత్సర ఆదాయం, వృత్తి వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. గ్రామీణ ప్రాంతం వారి ఆదాయం రూ. ఒక లక్ష 60వేలు, పట్టణ ప్రాంత ప్రజల ఆదాయం రూ.2లక్షలకు మించరాదు.
* సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుతో పాటు పైన పేర్కొన్న ధృవపత్రాలు, ఇతరాలను సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
* దరఖాస్తుల కుటుంబ సభ్యుల వివరాలను పొందుపర్చాలి.
* నిర్ణీత గడువు లోగా వచ్చిన దరఖాస్తులను స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించి నిబంధనలకు లోబడి అర్హత కలిగిన కుటుంబాలకు కొత్తగా ఆహార భద్రత కార్డులను జారీ చేస్తారు.
Previous Post Next Post

Contact Form