- చందమామ రావే జాబిల్లిరావే
- బండిమీద రావే బంతిపూలు తేవే
- పల్లకిలో రావే పంచదారతేవే
- సైకిలెక్కిరావే సమొసా తేవే
- పడవమీదరావే పట్టుతేనె తేవే
- మారుతీలో రావే మంచి బుక్క్సు తేవే
- పెందలాడరావే పాలు పెరుగుతేవే
- మంచి మనసుతో రావే ముదులిచ్చి పోవే
- అన్నియును తేవే మా అబ్బాయి/అమ్మాయికీయవే